AP: దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం APకే వస్తున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు. అమర్‌రాజా సహా పలు కంపెనీలు ఎలా వెళ్లిపోయాయో సజ్జల మరిచారా?.. APకి వచ్చే కంపెనీలు, పెట్టుబడులు YCP నేతలకు కనబడటం లేదా? అని నిలదీశారు. ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఆదర్శంగా నిలుస్తున్నామని.. ఇప్పటికే రూ.9.85 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపనలు జరిగాయని వెల్లడించారు.