బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశముందని, దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మరోవైపు రాబోయే 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.