AP: కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు ప్రజల భద్రతను పక్కన పెట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులు తమ వనరులు టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు.’ అని విమర్శలు చేశారు.