దేశంలోని 18 ప్రదేశాల్లో ఇవాళ భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల(PMBJK)ను ప్రధాని రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో కూడా ఓ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. వీటి ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కేంద్రం అందించనుంది.