ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ నిన్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.390 కాగా.. NSEలో రూ.420 వద్ద, BSEలో రూ.412 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో రూ.465.30 వద్ద గరిష్ఠాన్ని తాకగా, 16.91% లాభంతో రూ.455.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,02,062.01 కోట్లుగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల్లో 500 మందికి కేటాయించిన షేర్ల విలువ దాదాపు రూ.9000 కోట్లకు చేరగా.. వారంతా కోటీశ్వరులయ్యారు.