నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీ స్టారర్ మూవీ ‘సింగం అగైన్’. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. కాగా, 2011లో సింగం సినిమా రాగా.. దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు.