ELR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డా.మాలిని ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్విని కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కలెక్టర్కు పూలమొక్కను అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.