NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ IPOకి రానుంది. పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ ఈ నెల 19న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణి రూ.102-108గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు 138 షేర్లు ఉండనున్నాయి. ఇష్యూలో భాగంగా రూ.10వేల కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయనుంది. 2026-27 కల్లా సౌర, పవన విద్యుత్ విభాగాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఛైర్మన్ తెలిపారు.