శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1.70 కోట్లకు పైగా ఓటర్లు 225 మంది ఎంపీలను ఎన్నుకోనున్నారు. అరుణ కుమార దిస్సనాయకే నేతృత్వంలోని అధికార ‘నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ’కి ఇది తొలి పరీక్ష కానుంది. పార్లమెంటులో 113 సాధించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజపక్స సోదరులు, గొటబాయ, చమల్, బసిల్లు పోటీకి దూరంగా ఉన్నారు.