డయాబెటిస్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణులు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. గర్భధారణ సమయంలో మధుమేహ సంబంధ కారణాల వల్ల కలిగే ముప్పును తగ్గించడానికి వైద్యులు మెట్ఫార్మిన్ను సిఫారసు చేస్తుంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకుంటుందని అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. కిడ్నీలు సహా ఇతర అవయవాల ఎదుగుదలను నెమ్మదించేలా చేస్తుందని పేర్కొన్నారు.