దేశవ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోంది. శిలాజ ఇంధనమైన బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్స్ లైఫ్ అయిపోయిన చోట, బొగ్గు వనరులు కరిగిపోయిన చోట పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా న్యూక్లియర్ రియాక్టర్లు నెలకొల్పడంలో ప్రైవేటు భాగస్వాములతోనూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి మనోహర్ లాల్ వెల్లడించారు.