కొందరు భోజనం చేసేటప్పుడు చివరిలో పెరుగు లేకుండా పూర్తి చేయరు. అయితే కొన్ని ఆహారా పదార్థాలను పెరుగుతో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయను పెరుగుతో తినకూడదట. తింటే అసిడిటీ, వాంతులు, ఎగ్జిమా వంటి సమస్యలు తలెత్తుతాయట. పెరుగును పండ్లలో కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమస్యలు రావడంతో పాటు గుండెలో మంటగా అనిపిస్తుంది. చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు. పెరుగుతో ఖర్జూరతో తినవద్దు.