యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1998 నుంచి యాపిల్లో పనిచేస్తున్నాను.. కంపెనీ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టం’ అని చెప్పారు. ఇక దిగిపోయే సమయం ఆసన్నమైందని నా మనసు చెప్పే వరకు పని చేస్తూనే ఉంటానని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. దీంతో ఆయన ఇప్పట్లో రిటైర్ అవ్వరంటూ టెక్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.