హైదరాబాద్ ప్రజలకు మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఇలా అన్ని రకాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తిని ఇచ్చింది మెట్రో రైల్. మొదటి దశ రూట్లలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న రెండవ దశ పనులు త్వరలోనే మొదలుకాబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 24,042 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి హైదరాబాద్ వాసులకు తీపి కబురు చెప్పింది సర్కార్. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘ హైదరాబాద్ నగరం ఎదుర్కుంటున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్. అందుకుగాను ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించి ప్రభుత్వ రవాణాను పట్టిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మొదటి దశ మెట్రో లో ఎదురైన సమస్యలను, అనుభవాల దృష్ట్యా రెండవదసరాలో ప్రణాళికలు సిద్ధం చేస్తాం.. ‘ అన్నారు
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా 78.4 కిలోమీటర్ల పొడవున్న మరో 5 కారిడార్లను అభివృద్ధి చేస్తామని భట్టి ప్రకటించారు. మెట్రో రైలును ఓల్డ్ సిటీకి పాడిగించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానం చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం ప్రజలకు సేవలందిస్తున్న మొదటి దశ లైన్లను విస్తరిస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న నాగోలు కారిడార్ ను ఎల్.బి.నగర్ వరకు విస్తరిస్తామన్నారు. మియాపూర్ వరుకు ఉన్న కారిడార్ ను పటాన్ చెరువుకు, ఎల్.బి.నగర్ వరుకు ఉన్న కారిడార్ ను హయత్నగర్ వరకు పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు .