దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని తెచ్చేందుకు ముందడుగు వేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరిచామని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి సామాజిక న్యాయంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే వికసిత భారత్ లక్ష్యం అని తెలిపారు. పదేళ్లలో 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు, 10 కోట్ల మందికి గ్యాస్, 12 కోట్ల నివాసాలకు కుళాయి కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.