TG: రాష్ట్రంలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఈశాన్య దిశగా ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో అక్కడకక్కడ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని, మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పడిపోతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.