TG: హైదరాబాద్ గాజులరామారంలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. దీంతో బాధితులు ఆందోళన చేపట్టారు. కాగా 2014కి ముందు ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 275 ఎకరాలను ఇచ్చిందని, అధికారులతో కుమ్మక్కైన కొందరు ఆ భూమిని కబ్జా చేసి పేదలకు అమ్మేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేల కోట్ల విలువ కలిగిన ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.