BHPL: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. అల్లూరి అనూష అన్నారు. గణపురం మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వారు మాట్లాడారు. 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి జ్వరం, దగ్గు-జలుబు బాధితులను గుర్తించి చికిత్స అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.