AP: విశాఖలో కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 2 నుంచి ప్రారంభమయ్యాయి. మాసోత్సవాల్లో భాగంగా మూడో గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారి పూజలో MLA గంటా శ్రీనివాసరావు దంపతులు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా MLA వంశీకృష్ణ శ్రీనివాస దంపతులు తొలి పూజను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నడుమ అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించనున్నారు. అర్థరాత్రి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.