TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఉపఎన్నిక అంటేనే ఓటర్లు సహజంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని అన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఉపఎన్నికను నిర్వహించడంలో విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందన్నారు.