సంతానలేమితో బాధపడుతున్న దంపతుల విషయంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ కీలక ప్రకటన చేశారు. సంతానం కోసం తన వీర్యకణాలు ఉపయోగించుకోవాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తానని హామీ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా.. ఇప్పటికే 100 మందికిపైగా పిల్లలకు బయోలాజికల్‌గా తాను తండ్రినని ఈ ఏడాది జూలైలో దురోవ్ వెల్లడించారు.