మహిళల హక్కులను కాలరాసేలా ఇరాన్ కొత్త చట్టాలను రూపొందిస్తూనే ఉంది. తాజాగా అలాంటి చట్టాన్నే మరొకటి తీసుకువచ్చింది. ఇకపై ఎవరైనా హిజాబ్‌ను ధిక్కరిస్తే వారికి ఉరిశిక్ష లేదా 15 ఏళ్ల వరకు జైలు శిక్షను విధించే చట్టాన్ని ఆమోదించింది. హిజాబ్ సంస్కృతిని, ముస్లిం పవిత్రతను ప్రోత్సహించేందుకే ఈ చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించింది. నగ్నత్వం, అసభ్యంగా ఉండే దుస్తులను ధరించే వారికి ఈ చట్టం వర్తిస్తుందని చెప్పింది.