MDK: నర్సాపూర్ పట్టణంలోని ఎన్జీవోల కాలనీలోని సాయిబాబా ఆలయ 19వ వార్షికోత్సవం ఈ నెల 15న జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.