ATP: రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమి కన్నా పట్టాలు ఎలా ఎక్కువ వస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశ్నించారు. బుధవారం ఆత్మకూరు మండలం గిరిదిండ్లలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయని, గత వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలు చాలా ఎక్కువగా జరిగాయని తెలిపారు.