ADB: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమం హైదరాబాద్లోని శంషాబాద్లో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ వివాహానికి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ బాబు, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, ధన్ పాల్, సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.