ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా ఇండియా కార్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అన్ని మోడళ్లపై 2% పెంపు ఉంటుందని, ఈ కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కార్ల సంస్థలు కూడా 2025 నుంచి ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.