TG: సీఎం రేవంత్‌కు సుపరిపాలనా వేదిక లేఖ రాసింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని లేఖలో పేర్కొంది. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకునే విధంగా పీఎల్ఐ డిజైన్ చేయాలని సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూపొందించిన డిజైన్‌ను కేసీఆర్ మార్చారని.. దీంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారీగా పెరిగిందన్నారు.