మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో NCP(అజిత్ పవార్) వర్గానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గడియారం గుర్తు వినియోగంపై శరద్ పవార్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ గుర్తువల్ల ఓటర్లు గందరగోళానికి గురై తాము ఓట్లు కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు.. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవచ్చని ఆదేశించింది. అయితే, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించబోమని పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది.