TG: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ‘ ఆమె చేసిన వ్యాఖ్యల అంశాన్ని నిశితంగా పరిశీలించాం. కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సమంతను కించపరచాలని అనుకోలేదని వివరణ ఇచ్చారు. ఒకవేళ సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం.. పూర్తిగా వారి వ్యక్తిగతం’ అని పేర్కొంది.