TG: మన దేశంలో సాధారణంగా ఏడుగురికి ఒక చెట్టు ఉండాలి. కానీ ప్రతి 700 మందికి ఒక చెట్టు మాత్రమే ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ వెల్లడించారు. బెల్లంపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో పచ్చదనం పెరిగేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానాల్లో కూడా చెట్లు నాటాలని.. వాటిని సురక్షితంగా పెంచాలని అధికారులకు పిలుపునిచ్చారు.