AP: అల్లూరి జిల్లా పాడేరులోని పర్యాటక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. వంజంగి కొండ, మేఘాల కొండ వద్ద ప్రకృతి అందాలను చూసేందుకు భారీగా పర్యటకులు తరలివచ్చారు. చలికాలం కావటంతో కొండల్లో పొగమంచుతో ఏర్పడే అద్భుత దృశ్యాలను సూర్యోదయం సమయంలో వీక్షించేందుకు సందర్శకులు ఇష్టపడతారు. వారాంతం కావటంతో పెద్దఎత్తున జనం వెళ్లారు. పర్యటకుల వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి.