నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా… విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావడంతో పాటు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా కనిపించవచ్చు. ఇలాంటి వారు తప్పక డాక్టర్ను సంప్రదించాలి.