ఆటల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అవార్డును నిలిపివేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అవార్డు స్థానంలో అర్జున లైఫ్‌టైమ్ అవార్డును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అలాగే అట్టడుగు స్థాయిలో కోచ్‌లుగా కృషి చేసిన వారు ద్రోణాచార్య అవార్డుకు అర్హులని పేర్కొంది. ఈ ఏడాది అవార్డుల కోసం నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల 14 వరకు గడువు ఉంది.