AP: రాష్ట్రంలో మరో రెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమానాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. కాగా, ఈ రెండు కొత్త సర్వీసులతో విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకుంటుంది.