SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేపట్టి ఆశీర్వదించారు. అనంతరం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఈవో భద్రాజీ ఆయనకు జ్ఞాపికను బహుకరించారు.