హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 45 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడులను IDF ధృవీకరించింది. హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలను రక్షించాలని అమెరికాను కోరింది.