W.G: పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామంలో ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు పాలకొల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేస్తారు. అనంతరం 11.30నిమిషాలకు మంత్రి సొంత గ్రామం ఆగర్తిపాలెంలో పర్యటిస్తారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.