NLR: నాయుడుపేట మండలం జువ్వలపాలెం పంటకాలువ ఆక్రమణలపై తహసీల్దార్ గీతా వాణి ఆదేశాల మేరకు మండల సర్వేయర్ చరణ్ పరిశీలించారు. గతంలోనే పంటకాలువ రక్షణ కోసం సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటారు. కొంతమంది రైతులు కాలువ ఆక్రమించి తమ పొలాల్లోకి కలుపుకున్నారని, రైతులు స్వచ్ఛందంగా పూడికతీసి కబ్జాకు గురికాకుండా చొరవ చూపాలన్నారు.