VSP: హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా కథలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులను మోసం చేసింది. సోషల్ మీడియా వేదికగా యువకులకు వలపు వల విసిరి.. లక్షలకు లక్షలు లాగేసినట్లు తెలుస్తోంది. జమీమాను రెండు రోజుల కస్టడీకి కంచెరపాలెం పోలీసులు తీసుకున్నారు. మొబైల్ డేటా ఆధారంగా అనేక ప్రశ్నలు వేశారు. ఆమె పోలీసులకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.