నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2 తాండవం’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ‘అఖండ 2’ కథ మొదలవుతుందట. ప్రగ్యా జైస్వాల్ హెల్త్ ట్రీట్మెంట్ కోసం బాలయ్య రెండో పాత్ర US వెళ్లగా.. అక్కడ తెలుగు వాళ్లపై దాడి జరిగే క్రమంలో వారిని బాలయ్య కాపాడుతారట. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.