NLR: కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈయనకు మాత్రమే ఈ అవకాశం లభించింది. కాగా తనకు బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక కీలక పదవులు లభించడంతో జిల్లా వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.