NDL: కొలిమిగుండ్ల మండల పరిధిలోని బెలుంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కొండయ్య (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం పేరుసోమల, రామిరెడ్డి పల్లె గ్రామాల మధ్యలో ఉన్న జీఎన్ఎన్ఎస్ కాలవలో మృతదేహం కొట్టుకుపోతుండగా.. ప్రజలు గమనించి బయటికి తీసి బెలుంకు చెందిన వ్యక్తిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.