మూగ జీవాల సంరక్షణ కోసం నటి రేణు దేశాయ్ NGO ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు రామ్ చరణ్ భార్య ఉపాసన తన వంతు సాయం అందించారు. రేణు దేశాయ్ అంబులెన్స్ కొనుగోలు చేయడంలో ఉపాసన సాయం చేశారు. చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో విరాళం ఇచ్చినట్లు రేణు ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. ‘అంబులెన్స్ కొనుగోలుకు విరాళం ఇచ్చిన రైమీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. దీనికి ఉపాసన కొణిదెలను ట్యాగ్ చేశారు.