ASR: అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణికి మరో కీలక కమిటీలో కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కమిటీ సభ్యురాలుగా నియమిస్తూ పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆమె కేంద్ర ప్రభుత్వం పరిధిలోని హౌసింగ్, జాతీయ ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు.