TG: రాష్ట్ర కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. ‘దీపావళి కానుకగా ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తాం. ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్ 30లోపు కులగణన పూర్తి చేయాలని భావిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించాలని డిసైడ్ అయ్యాం’ అని పేర్కొన్నారు.