W.G: కొవ్వూరులో చికెన్ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి. ఆదివారం చికెన్ రిటైల్ ధర 240-260గా ఉంది. ఆదివారం వారంతపు సెలవు కావడంతో వినియోగదారులు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లలో ఒక పక్క కాయకూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో వంకాయల రిటైల్ ధర 90-110గా ఉంది. టమాటో-60, బెండకాయ-60, క్యారెట్- 60, పచ్చిమిర్చి-60గా ఉంది.