నిజామాబాద్: పులాంగ్ ఎక్స్ రోడ్డులో ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు ‘స్టాక్ మార్కెట్.. పెట్టుబడులు’ అనే అంశంపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ కె.కృష్ణ కైలాస్ తెలిపారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనే దానిపై అవగాహన ఉంటుంది.