VSP: పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ను శనివారం రాత్రి విశాఖలోని గ్రాండ్ బే హోటల్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మిత్ర బృందం ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం ఉత్తరాంధ్రకు గర్వ కారణమన్నారు.