W.G: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. 340 రైతు సేవా కేంద్రాల్లో 447 మంది టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామన్నారు.