అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ రెండో వన్డే జరగనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ మహిళ జట్టు తొలి మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కివీస్ స్టార్ ఆల్రౌండర్ అమెలియా కెర్ తొలి మ్యాచ్లో గాయపడి సిరీస్ మొత్తం దూరమైంది. కాగా, ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో చూడవచ్చు.